: మీడియా మోడీ ర్యాలీలనే కవర్ చేస్తోంది: కాంగ్రెస్


మీడియాపై కాంగ్రెస్ మండిపడింది. కాంగ్రెస్ తరఫున ఢిల్లీలో ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రచారం చేస్తుంటే.. ఒక్క గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ సభలనే మీడియా సంస్థలు కవర్ చేస్తున్నాయని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ షకీల్ అహ్మాద్ ఆరోపించారు. ఈ తీరు తమను ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. షీలాదీక్షిత్, విజయ్ బహుగుణ, ఊమెన్ చాందీ, బూపీందర్ సింగ్ హుడా, వీరభద్ర సింగ్ ఢిల్లీలో ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. వీరు పాలిస్తున్న రాష్ట్రాలలో గుజరాత్ కంటే ఎక్కువ అభివృద్ధి జరిగిందన్నారు.

  • Loading...

More Telugu News