: టెన్నిస్ అందాల తార స్టెఫీ గ్రాఫ్ కు పితృ వియోగం


అద్భుతమైన ఆటతీరుతో పాటు తన అందంతో టెన్నిస్ కే వన్నె తెచ్చిన జర్మనీ టెన్నిస్ దిగ్గజం స్టెఫీ గ్రాఫ్ కు పితృ వియోగం కలిగింది. ఆమె తండ్రి పీటర్ గ్రాఫ్ నిన్న రాత్రి మాన్ హీమ్ లో కేన్సర్ వ్యాధితో మరణించారు. ఆయన వయస్సు 73 సంవత్సరాలు. స్టెఫీ గ్రాఫ్ తన కెరీర్ ను కొనసాగించిన సమయంలో, పీటర్ గ్రాఫ్ ఆమె వెన్నంటే ఉండి ప్రోత్సహించారు. తండ్రిగా బాధ్యతలు నిర్వహిస్తూనే కూతురుకి కోచ్ గా, మేనేజర్ గా కూడా పీటర్ గ్రాఫ్ వ్యవహరించారు. తన కెరీర్ లో 22 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలుచుకున్న స్టెఫీ... అమెరికన్ టెన్నిస్ స్టార్ ఆండ్రీ అగస్సీని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News