: ఉగ్రవాదంపై పాక్ ప్రధానితో చర్చించలేదన్న ఖుర్షీద్


పాకిస్థాన్ ప్రధాని రాజా పర్వేజ్ అష్రాఫ్ తో ఉగ్రవాద అంశంపై ఎలాంటి చర్చ జరగలేదని విదేశీ వ్యవహారాల మంత్రి సల్మాన్ ఖర్షీద్ పేర్కొన్నారు. ఇది కేవలం ఆయన ప్రయివేటు పర్యటన మాత్రమేనన్నారు. ఇలాంటి సమయాల్లో అలాంటి అంశాలు చర్చించడం సరైంది కాదని ఆయన విలేకరులకు తెలిపారు. సరైన సమయం వచ్చినప్పుడు కచ్చితంగా చర్చలు చేస్తామన్నారు. అంతకుముందు అష్రాఫ్ కు స్వాగతం పలికిన ఖుర్షీద్ జైపూర్ రామ్ భగ్ ప్యాలెస్ హోటల్ లో విందు ఇచ్చారు.

అనంతరం 
అజ్మీర్ దర్గాను దర్శించేందుకు పాక్ ప్రధాని వెళ్లిపోయారు. దర్గా వద్ద ఆయన ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. 42 మీటర్ల, 35 కిలో గ్రాముల ఛాదర్ ను ఈ సందర్భంగా సమర్పించారు. ప్రపంచ శాంతిని, ఆనందాన్ని పాకిస్థాన్ కోరుకుంటుందని ఆయన దర్గా వద్ద సందర్శకుల పుస్తకంలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News