: రాష్ట్రవ్యాప్తంగా స్కూల్ బస్సులపై రవాణా శాఖాధికారుల కొరడా
స్కూల్, కళాశాలల బస్సులపై రవాణా శాఖాధికారులు కఠిన చర్యలు ప్రారంభించారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న, ఫిట్ నెస్ లేని 82 బస్సులను రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు సీజ్ చేశారు. హైదరాబాద్ లో 21, వరంగల్ లో 20, మెదక్ లో 15, పశ్చిమగోదావరి జిల్లాలో 11 బస్సులను సీజ్ చేశారు.