: బ్యాంకు లావాదేవీల ఎస్‌ఎంఎస్ ఫీజులు తగ్గనున్నాయ్
బ్యాంకులు మనకు పంపించే ఆర్ధిక లావాదేవీలకు సంబంధించిన ఎస్‌ఎంఎస్‌లకు ప్రత్యేక ఛార్జిని వసూలు చేస్తుంటాయి. దీనికి ఫిక్స్‌డ్ ఛార్జీలు నిర్ణయించకుండా వినియోగదారులు ఎవరి వాడకాన్ని అనుసరించి వారి వద్దనుండి ఫీజును వసూలు చేయాలని భారత రిజర్వు బ్యాంకు ఆదేశించింది. ప్రస్తుత టెలికాం సర్వీసు ప్రొవైడర్లు, బ్యాంకులు వాడుతున్న టెక్నాలజీతో ఇది సాధ్యమేనని ఆర్‌బిఐ చెబుతోంది.
2011లో వినియోగదారులకు సంబంధించిన అన్ని రకాల ఆర్ధిక లావాదేవీలకు సంబంధించిన ఆన్‌లైన్ అలర్ట్స్‌ను వారికి చేరవేయాలని ఆర్‌బిఐ అప్పట్లో మార్గదర్శకాలను జారీచేసింది. అయితే ఇలా ఎస్‌ఎంఎస్‌ల అలర్ట్స్ కోసం ఎంత ఛార్జీలను విధించాలనే విషయాన్ని మాత్రం సూచించలేదు. ఆర్ధిక నేరాల నియంత్రణకు బ్యాంకులు ఎస్‌ఎంఎస్ అలర్ట్స్‌ను ప్రారంభించాయి. దీనికి వార్షికంగా కొంత ఛార్జీని వసూలు చేసేవి. స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా మెసేజ్ అలర్ట్స్ కోసం వార్షికంగా 60 రూపాయలను వసూలు చేయగా, కెనరా బ్యాంకు కూడా ఇదేవిధంగా వసూలు చేయడం ప్రారంభించింది. ఇప్పుడు ఆర్‌బిఐ తాజా ఆదేశాలతో ఇకనుండి ఎస్‌ఎంఎస్ అలర్ట్స్ ఛార్జీలు తగ్గే అవకాశం ఉంది.