: చిరంజీవికి యూటీకి, ఊటీకి తేడా తెలియదు: కేటీఆర్
కేంద్ర మంత్రి చిరంజీవికి యూటీకి, ఊటీకి తేడా తెలియదని టీఆర్ఎస్ నేత కేటీఆర్ ఎద్దేవా చేశారు. వరంగల్ లో ఆయన మాట్లాడుతూ రాయల తెలంగాణ ప్రతిపాదనకు అంగీకరించేది లేదని అన్నారు. 10 జిల్లాల తెలంగాణకు మాత్రమే తాము సిద్ధంగా ఉన్నామన్నారు. సీబీఐ కేసుల నుంచి బయటపడేందుకే జగన్ జాతీయ నేతలను కలుస్తున్నారని ఆయన తెలిపారు.