: రాజస్థాన్ లో కాంగ్రెస్ ది ఏకపక్ష విజయమే:అశోక్ గెహ్లాట్
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఏకపక్ష విజయం ఖాయమని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ధీమా వ్యక్తం చేశారు. జోథ్ పూర్ లోని మహమందిర్ ప్రాంతంలో ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ, తాము చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలే తమను గెలిపిస్తాయని గెహ్లాట్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాజస్థాన్ లో మోడీ, వసుంధర రాజేల ప్రభావం ఏ మాత్రం పని చేయలేదని ఆయన అన్నారు. మోడీ భావజాలంపై దేశ ప్రజలు సుముఖంగా లేరని, ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మతం అజెండాగా లేని పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని గెహ్లాట్ తెలిపారు.