: ఆర్టికల్ 370 పై చర్చ జరగాలి: మోడీ


జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక హోదానిస్తున్న ఆర్టికల్ 370 పై బీజేపీ ఆలోచనా విధానం మారినట్టు కనిపిస్తోంది. బీజేపీ ప్రధాని అభ్యర్థిగా తొలిసారి జమ్మూలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మోడీ మాట్లాడుతూ, ఆర్టికల్ 370పై అన్ని కోణాల్లో చర్చ జరగాలని అన్నారు. గతంలో పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ వెలిబుచ్చిన అభిప్రాయాన్నే మోడీ కూడా వ్యక్తం చేశారు. దీని వల్ల మహిళలకు సమానావకాశాలు లభించే అవకాశం లేదని మోడీ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News