: శ్రీవారి ఆభరణాల లెక్కింపు
తిరుమల శ్రీవారి ఆభరణాల లెక్కింపు ప్రక్రియ ఈ రోజు ప్రారంభం అయింది. వార్షిక పరిశీలనలో భాగంగా టీటీడీ సిబ్బంది స్వామి వారి ప్రతీ ఆభరణాన్ని పరిశీలించి, వాటి వివరాలను రికార్డుల్లో నమోదు చేస్తారు. గత రికార్డులలో పేర్కొన్న వివరాల ఆధారంగా ఆభరణాల మదింపు నేటి నుంచి నెల రోజులపాటు జరుగుతుంది. తర్వాత స్వామి వారి ఆభరణాలను భక్తుల కోసం ప్రదర్శిస్తారు.