: జగన్ లా సోనియా కుటుంబం ఎవరినీ దోచుకోలేదు: వీహెచ్
జగన్ లా సోనియా కుటుంబం ఎవరినీ దోచుకోలేదని రాజ్యసభ సభ్యుడు వీహెచ్ వైఎస్సార్ సీపీ అధినేతపై విరుచుకుపడ్డారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ రాహుల్ ను ప్రధానిని చేసేందుకు రాష్ట్రాన్ని విభజిస్తున్నారంటూ విమర్శించే అర్హత జగన్ కు లేదని, పదవుల కోసం కక్కుర్తి పడలేదని అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలుపుతూ రేపటి నుంచి యాత్ర చేపట్టినట్టు తెలిపారు. ఈ కార్యక్రమం నల్గొండ జిల్లా యాదగిరిగుట్ట నుంచి ప్రారంభం అవుతుందన్నారు. రాయల తెలంగాణ అంటే బీజేపీ మద్దతు ఇస్తుందో లేదో తెలియదని అన్నారు. సీమాంధ్ర నేతలు ఇంకా హింసించకుండా విభజనకు సహకరించాలని ఆయన సూచించారు.