: 34 పాలసీలకు ఎల్ఐసీ మంగళం
కొత్త నిబంధనలు అమల్లోకి రావడంతో భారతీయ జీవిత బీమా సంస్థ(ఎల్ఐసీ) 34 పాలసీలను డిసెంబర్ నెలలో నిలిపివేయనుంది. జీవిత బీమా నియంత్రణ సంస్థ (ఐఆర్ డీఏ) నిబంధనలకు అనుగుణంగా లేకపోవడంతో ఈ పాలసీలను నిలిపివేయాలని ఎల్ఐసీ నిర్ణయించింది. జీవన్ అమృత్ పాలసీని ఈ నెల 7నుంచి, జీవన్ సురభి పాలసీని 14 నుంచి ఆపివేస్తారు. మరో రెండు పాలసీలను ఈ నెల 21న, రెండు పాలసీలను 28న.. మిగిలిన 28 పాలసీలు 31 నుంచి నిలిచిపోనున్నాయి. ఇప్పటికే మార్పిడి చేసుకోదగిన టర్మ్ అష్యూరెన్స్, చిల్డ్రన్ డిఫర్డ్ ఎండోమెంట్ అష్యూరెన్స్ సహా 14 పాలసీలను ఎల్ఐసీ గతనెలలోనే ఆపివేసింది.