: రాయల తెలంగాణకు మేం వ్యతిరేకం: టీఆర్ఎస్


రాయల తెలంగాణ ప్రతిపాదనను తెలంగాణ సమాజం ముక్తకంఠంతో వ్యతిరేకిస్తోందని టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రావణ్ తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ గత మూడు రోజులుగా రాయల తెలంగాణ ప్రచారంపై తెలంగాణ ప్రజల నుంచి తమకు ఒత్తిడి వస్తోందన్నారు. ఈ ప్రతిపాదనకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోవద్దని ప్రజలు చెబుతున్నారని చెప్పారు. సీడబ్ల్యూసీ తీర్మానం చేసినట్లుగా పది జిల్లాల తెలంగాణే తమకు కావాలని, మరే ప్రతిపాదనా తమకు ఆమోదయోగ్యం కాదని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News