: ముంచుకొస్తున్న మరో తుపాను ముప్పు
రాగల 12 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. అగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. ఇది క్రమంగా పశ్చిమ దిశగా పయనించి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగా బలపడే అవకాశం ఉంది. అల్పపీడనం ఏర్పడ్డానికి అనుకూల వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని, ఇది మరింత బలపడి రాష్ట్రం దిశగా పయనిస్తే రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.