: ఇండోనేషియాలో భూకంపం
ఇండోనేషియాలోని తూర్పు తైమూర్ రాజధాని డిలీకి 351 కిలోమీటర్ల దూరంలో ఈ ఉదయం భూకంపం సంభవించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే అదివారం వెల్లడించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.3 గా నమోదైంది. దీని ప్రభావంతో సునామీ వచ్చే అవకాశం లేదని, ఆస్తి నష్టం, ప్రాణ నష్టంపై పూర్తి సమాచారం అందాల్సి ఉందని ఇండోనేషియా దేశ ప్రకృతి విపత్తుల శాఖాధికారులు తెలిపారు.