: సర్వ భూపాల వాహనంపై విహరించిన శ్రీ పద్మావతి అమ్మవారు


శ్రీ పద్మావతి అమ్మవారు ఇవాళ ఉదయం సర్వభూపాల వాహనంపై కాళింగి మర్థిని రూపంలో తిరు వీధుల్లో విహరించారు. చిత్తూరు జిల్లా తిరుచానూరులో పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడోరోజు వేలాది మంది భక్తులు సర్వ భూపాల వాహన సేవలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. వేద పారాయణం, మంగళ వాయిద్యాలు, భజన బృందాలతో సర్వ భూపాల సేవ కన్నుల పండుగగా సాగింది. ఇవాళ రాత్రి అమ్మవారికి సింహ వాహన సేవ జరగనుంది.

  • Loading...

More Telugu News