: గల్లంతైన పైలట్ల మృత దేహాలు లభ్యం


కొద్దిరోజుల క్రితం విశాఖలో జరిగిన నావికా దళ హెలికాప్టర్ ప్రమాదంలో గల్లంతైన ఇద్దరు పైలట్ల మృత దేహాలు నేడు లభ్యమయ్యాయి. వీరి పేర్లు ప్రణవ్ లిఖిత్, గౌరీ శంకర్ సేన్ అని తెలుస్తోంది. పోస్ట్ మార్టమ్ చేసేందుకు వీరి మృత దేహాలను స్థానిక కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు.

ఈనెల 5వ తేదీన తూర్పు నావికాదళానికి చెందిన చేతక్ హెలికాప్టర్ ఐఎన్ఎస్-డేగా నుంచి మధ్యాహ్నం బయలుదేరింది. కాసేపటికే సముద్రంలో కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు గల్లంతు కాగా, మరో ఇద్దరు గాయాలతో బయటపడ్డారు. వీరిద్దరిని ఐఎన్ఎస్-కళ్యాణి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.  

  • Loading...

More Telugu News