: కృష్ణా జలాలపై తీర్పుకు వ్యతిరేకంగా కృష్ణాజిల్లాలో ధర్నా
కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పుకు వ్యతిరేకంగా కృష్ణాజిల్లాలోని నందిగామ మండలం ఐతవరంలో టీడీపీ ధర్నా చేపట్టింది. ఎమ్మెల్యే దేవినేని ఉమ, తంగిరాల ప్రభాకర్ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. వెంటనే పోలీసులు వారిద్దరినీ అరెస్టు చేశారు. ట్రైబ్యునల్ తీర్పును రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు.