: రాజస్థాన్ లో ముమ్మర తనిఖీలు.. రూ. 13 కోట్ల నగదు పట్టివేత
ఆదివారం జరుగనున్న రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం ముమ్మర తనిఖీలు నిర్వహిస్తోంది. సరిహద్దు రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హర్యానా, గుజరాత్ నుంచి వచ్చే వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. రాజస్థాన్ లో ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు సుమారు 13 కోట్ల రూపాయల నగదు, 27 కోట్ల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని ఎన్నికల సంఘం ప్రకటించింది.