: అధికారిని బెదిరించిన బీహార్ ఎమ్మెల్యేపై కేసు నమోదు
జిల్లా వ్యవసాయాధికారిని దూషించారనే ఆరోపణలపై బీహార్ సారణ్ జిల్లాలోని బీజేపీ ఎమ్మెల్యేపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే జనక్ సింగ్ తనను దూషించి, బెదిరించారని వ్యవసాయాధికారి వేదప్రకాష్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, వ్యవసాయ శిక్షణ కమిటీలకు జరిపిన నియామకాల్లో చోటుచేసుకున్న అవకతవకలను మాత్రమే తాను ప్రశ్నించానని... దూషించలేదని ఎమ్మెల్యే చెబుతున్నారు.