: చిన్నారులపై పెరిగిపోతున్న అత్యాచారాలు ఆందోళనకరం : దక్షిణాఫ్రికా మంత్రి గ్లింగ్ వాన్
దక్షిణాఫ్రికాలో చిన్నారులు, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను దక్షిణాఫ్రికా మంత్రి లులూ గ్లింగ్ వాన్ ఖండించారు. దేశంలో ఇలాంటి ఘటనలు రోజురోజుకు అధికమవుతున్నాయని వస్తున్న నివేదికలను చూసి లులూ ఆందోళన వ్యక్తం చేశారు. లైంగిక దాడులకు గురి అవుతున్న బాధిత మహిళలకు అండగా నిలవాలని దక్షిణాఫ్రికా వాసులకు ఆమె విజ్ఞప్తి చేశారు.
సమాజంలో అటువంటి ఘటనలు జరగకుండా ఉండాలని ప్రతి ఒక్కరూ ప్రార్థించాలన్నారు. మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులను అరికట్టేందుకు పటిష్ఠమైన చర్యలు చేపట్టాలని దక్షిణాఫ్రికా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే నిందితులకు విధించే శిక్షలను మరింత కఠినతరం చేయాలని లులూ గ్లింగ్ వాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.