: తేజ్ పాల్ వ్యవహారంతో బీజేపీ స్థిరపడాలనుకుంటోంది: మేధా పాట్కర్
లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న 'తెహల్కా' వ్యవస్థాపకుడు తరుణ్ తేజ్ పాల్ వ్యవహారంలో బీజేపీ హస్తముందంటూ విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. గతంలో బీజేపీపై తెహల్కా శూల శోధన (స్టింగ్ ఆపరేషన్) చేసిన విషయం కూడా విదితమే. ఈ నేపథ్యంలో, తేజ్ పాల్ వ్యవహారాన్ని ఉపయోగించుకుని దాంతో వచ్చే మార్కులతో బీజేపీ స్థిరపడాలనుకుంటోందని సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ పీటీఐతో ఫోన్ లో వ్యాఖ్యానించారు. అయితే, ఇందులో ఎలాంటి రాజకీయం ఉండకూడదన్నారు. ఒకవేళ అతను నేరానికి పాల్పడి ఉంటే కోర్టు ముందు రుజువవుతుందని పాట్కర్ పేర్కొన్నారు. కాగా, ఈ విషయంలో పోలీసుల విచారణ రాజకీయంగా ప్రభావితమైందని తాను భావించడం లేదన్నారు.