: హైదరాబాద్ లో కొత్త ఫార్ములా క్రికెట్.. మెంటార్లుగా నటులు


ఒక కొత్త ఫార్ములా క్రికెట్ హైదరాబాద్ లో గ్రౌండులోకి రాబోతోంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి ఏర్పాటైన జట్లు.. ఒక దానితో మరొకటి ఒకటి తలపడనుండడమే ఈ ప్రత్యేకత. ఈ జట్లకు మెంటార్లుగా సినీ నటులు వ్యవహరించడం మరో విశేషం. నేటి ఆధునిక కాలంలో విద్యార్థులు కంప్యూటర్లకు అంకితం అవుతున్నారు. క్రీడలను మర్చిపోతున్నారు. అదే సమయంలో తల్లిదండ్రులు కూడా తమ పిల్లలతో సమయం వెచ్చించడం తగ్గిపోతోంది. ఏక కాలంలో ఈ రెండింటికీ పరిష్కారంగా తల్లిదండ్రులు, పిల్లలతో కలిసి జట్లను ఏర్పాటు చేసి.. వాటి మధ్య ట్వంటీ 20 మ్యాచులను నిర్వహిస్తోంది చిరెక్ స్కూల్.

డిసెంబర్ 1న బీహెచ్ఈఎల్ స్టేడియం ఇందుకు వేదిక కానుంది. మొత్తం నాలుగు జట్లకు పర్వత శ్రేణుల పేర్లు పెట్టారు. ఆరావళీ అవెంజర్స్(గ్రీన్ హౌస్), నీల్ గిరి నింజాస్(బ్లూ హౌస్), సాత్పుర సూపర్ హీరోస్(యెల్లో హౌస్), వింధ్య విక్టర్స్(రెడ్ హౌస్).ఒక్కో జట్టులో 12 మంది. అందులో ఆరుగురు విద్యార్థులు.. ఆరుగురు తల్లిదండ్రులు. 20-20 ఫార్మాట్ లో ప్రతీ జట్టు క్వాలిఫయింగ్ రౌండ్ లో ఆడాలి. గెలిచిన జట్టు రెండు సెమీ ఫైనల్స్ లో, విజేత ఫైనల్స్ లో ఆడాల్సి ఉంటుంది. ఆరావళి జట్టుకు కథానాయకుడు కల్యాణ్ రామ్, సాత్పురాకు కమెడియన్ సునీల్, నీల్ గిరికి కన్నడ నటుడు అకుల్ బాలాజీ, వింధ్యకు టీవీ నటుడు శ్రీధర్ రావు మెంటార్లుగా వ్యవహరిస్తారు.

  • Loading...

More Telugu News