: తేజ్ పాల్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై సాయంత్రం తీర్పు
'తెహల్కా' ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై తీర్పును గోవాలోని పనాజీ సెషన్స్ కోర్టు వాయిదా వేసింది. సాయంత్రం 4.30 గంటల తర్వాత న్యాయస్థానం తీర్పు వెల్లడించనుంది. అంతకుముందు తేజ్ పాల్ కారు దిగి కోర్టు లోపలికి వస్తున్న సమయంలో ఓ వ్యక్తి నల్లగుడ్డను విసిరేందుకు ప్రయత్నించాడు. వెంటనే పొలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు.