: త్వరలో రూ. 300 కోట్లతో యానిమేషన్, గేమింగ్ సెంటర్: పొన్నాల


హైదరాబాద్ లోని రాయదుర్గం సమీపంలో త్వరలో రూ. 300 కోట్లతో అత్యాధునిక యానిమేషన్, గేమింగ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ఐటీ శాఖామంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. గేమింగ్ సెంటర్ ఏర్పాటుకు సంబంధించి డిసెంబర్ 3న జరిగే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామన్నారు.

రవీంద్ర భారతిలో జరిగిన పద్మ మోహన్ ఆర్ట్స్ 23వ వార్షికోత్సవంలో బుల్లితెర కళాకారులకు పద్మ మోహన టీవీ అవార్డులను మంత్రి పొన్నాల లక్ష్మయ్య అందజేశారు. మాటీవీ నుంచి బెస్ట్ కామెడియన్ గా మల్లికతో పాటు టీవీ రంగానికి చెందిన మరో 42 మంది కళాకారులు పద్మ మోహన్ అవార్డులు అందకున్నారు. ఈ కార్యక్రమంలో సినీ నటి కవిత, టీడీపీ కార్యదర్శి అరవింద కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News