: మకావు ఓపెన్ సెమీ ఫైనల్స్ కు పీవీ సింధు
మకావు ఓపెన్ సెమీ ఫైనల్స్ లో తెలుగు బ్యాడ్మింటన్ తేజం పీవీ సింధు అడుగు పెట్టింది. క్వార్టర్ ఫైనల్ మ్యాచులో హాంగ్ కాంగ్ కు చెందిన చాన్ పై 21-17, 21-12 తేడాతో విజయం సాధించడంతో ఇది సాధ్యమైంది. ఈ రోజు జరగనున్న సెమీ ఫైనల్స్ లో చైనాకు చెందిన కిన్ జిన్ జింగ్ తో సింధు తలపడుతుంది.