: విశాఖలో గురజాడ 150వ జయంతి
మహాకవి గురజాడ అప్పారావు 150వ జయంతిని విశాఖలో ఘనంగా నిర్వహించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న గురజాడ విగ్రహానికి ఎమ్మెల్సీ శర్మ పూలమాల వేసి నివాళులర్పించారు. గురజాడ పేరుమీద జాతీయ సాంస్కృతిక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని ఇంతవరకు నెరవేర్చలేదని ఈ సందర్భంగా అన్నారు. కనీసం విజయనగరంలోని గురజాడ ఇంటినైనా పరిరక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు.