: 26 మంది వెన్నుపోటుదారుల లిస్టును సోనియాకు పంపిన బొత్స
కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడుస్తున్న 26 మంది కాంగ్రెస్ నేతల లిస్ట్ ను పీసీసీ చీఫ్ బొత్స రెడీ చేశారు. ఈ లిస్ట్ లో కాంగ్రెస్ మంత్రులు, సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ లిస్ట్ ను ఇప్పటికే సోనియాకు పంపించారు. వీరిపై పార్టీపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి మేడం అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు. వీరంతా వేరే పార్టీలలో చేరేందుకు అంతా సిద్ధం చేసుకుని... సొంత పార్టీపైనే విమర్శలు గుప్పిస్తున్నారని సోనియాకు పంపిన నివేదికలో బొత్స తెలిపినట్టు సమాచారం.
ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ లిస్టులో విశాఖపట్నం జిల్లా నుంచి ఐదు మంది, కర్నూలు నుంచి ముగ్గురు, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చమగోదావరి జిల్లాల నుంచి ఇద్దరు చొప్పున ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే అనంతపురం, కడప, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, విజయనగరం జిల్లాల నుంచి ఒక్కొక్కరు ఉన్నట్టు సమాచారం. దీనికి సంబంధించి మరికొంత సమాచారం తెలియాల్సి ఉంది. వీరంతా పార్టీని విమర్శించడమే అజెండాగా పెట్టుకున్నారని బొత్స తన తన నివేదికలో పేర్కొన్నారు.