: కార్లు పాతవే... కానీ సామర్ధ్యం పెరుగుతుంది


పాత కార్లే... కానీ వాటి ఇంజన్‌ సామర్ధ్యం మరింత ఎక్కువ అయ్యేలా కొత్త విధానాన్ని పరిశోధకులు కనుగొన్నారు. తాము కనిపెట్టిన ఒక కొత్త పద్ధతితో ఇప్పుడున్న కార్లు, విమానాల ఇంజన్ల సామర్ధ్యం రెట్టింపు కాబోతోందని పరిశోధకులు చెబుతున్నారు.

వసేదా యూనివర్సిటీలోని సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ అధ్యాపకుడు కెన్‌ నైతో ఈ కొత్తరకం పద్ధతిని గురించి మాట్లాడుతూ సంప్రదాయ ఇంజన్లకు ప్రత్యామ్నాయంగా శక్తి మార్పిడి సూత్రం ఆధారంగా రెట్టింపు ఉష్ణ సామర్ధ్యాన్ని విడుదల చేసే ఇంజన్లను తయారుచేయవచ్చని తెలిపారు. థర్మో ఫ్లుయిడ్‌ డైనమిక్స్‌ సిద్ధాంతం ఆధారంగా ఈ సూత్రాన్ని ప్రతిపాదించారు. దీనికి ఇంజన్‌ పరిమాణంతో సంబంధం లేదని కెన్‌ చెబుతున్నారు.

  • Loading...

More Telugu News