: ప్రధాని నివాసంలో కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ
ఢిల్లీలోని ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసంలో కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్, సుశీల్ కుమార్ షిండే, చిదంబరం, జైరాం రమేశ్ తో పాటు పలువురు ఈ సమావేశానికి హాజరయ్యారు. జీవోఎం ఖరారు చేసిన సిఫార్సులతో కూడిన ముసాయిదా నివేదికపై కమిటీ చర్చించనుంది.