: తిరుచానూరులో కనువిందు చేస్తున్న పుష్ప ప్రదర్శన


తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన పువ్వుల ప్రదర్శనను టీటీడీ ఛైర్మన్ కనుమూరి బాపిరాజు ప్రారంభించారు. అమ్మవారి ఉద్యానవనంలో భక్తులను ఆకట్టుకునేలా రంగు రంగుల పుష్పాలను అలంకరించారు. తిరుమల నుంచి ప్రత్యేకంగా తీసుకువచ్చిన పూలతో రూపొందించిన దేవతా మూర్తులు, ఏనుగు బొమ్మలు భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఈ ప్రదర్శన తొమ్మిది రోజుల పాటు జరుగనుంది.

  • Loading...

More Telugu News