: తెలంగాణపై ముందుకెళ్తే మెరుపు సమ్మె: అశోక్ బాబు


తెలంగాణ ప్రక్రియపై ముందుకెళ్తే మెరుపు సమ్మె చేస్తామని ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ బాబు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విభజనను నిరసిస్తూ ఏపీఎన్జీవోలు 66 రోజుల పాటు సమ్మె చేసిన విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచుకోవాలని, రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీమాంధ్రకు చెందిన మంత్రులు పదవులను అంటిపెట్టుకుని ఉన్నారని విమర్శించారు. అమాత్యులు అనుసరిస్తున్న వైఖరి సిగ్గుచేటని అశోక్ బాబు అన్నారు.

  • Loading...

More Telugu News