: ఈ పాపం వైఎస్, కాంగ్రెస్ దే: దేవినేని ఉమ
కృష్ణా జలాలపై ట్రైబ్యునల్ తీర్పుకు కాంగ్రెస్ పార్టీ, వైఎస్ రాజశేఖరరెడ్డిలే కారణమని తెదేపా నేత దేవినేని ఉమ ఆరోపించారు. కృష్ణా నీటి విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని అప్పట్లో టీడీపీ ఎన్ని ఆందోళనలు చేసినా వైఎస్ పట్టించుకోలేదని అన్నారు. రాష్ట్ర విభజన అంశంలో కీలకపాత్ర పోషిస్తున్న కర్ణాటక కేంద్ర మంత్రులు వీరప్ప మొయిలీ, జైరాం రమేష్ లు... మన రాష్ట్రంపై కక్ష గట్టి తీర్పు తమకు అనుకూలంగా వచ్చేలా చేశారని ఉమ ఆరోపించారు.