: నన్ను రాజకీయాల్లోకి లాగకండి: తెహెల్కా బాధితురాలు
తరుణ్ తేజ్ పాల్ పై తాను ఫిర్యాదు చేయడాన్ని, ఎన్నికల ముందు కుట్రగా అభివర్ణించడం... తనను కలచివేసిందని తెహెల్కా బాధితురాలు తెలిపింది. తన ఫిర్యాదు అనంతరం చోటుచేసుకున్న పరిణామాలపై ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. తనను రాజకీయాల్లోకి లాగకండని అభ్యర్థించింది. ఈ వివరాలను 'కాఫిలా' అనే వెబ్ సైట్లో ఆమె పోస్ట్ చేసింది. హింస, అధికారం వంటి అంశాలపై స్పందించేటప్పుడు సంయమనం పాటించాలని కోరింది.