: ఈ పాపం వైఎస్ దే.. తీర్పు రైతాంగానికి గొడ్డలి పెట్టు: ధూళిపాళ్ల
మిగులు జలాలు అవసరం లేదని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి లేఖ రాశారని.. ఈ పాపం ఆయనదేనని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, కృష్ణా జలాల వినియోగానికి సంబంధించి బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పు రైతాంగానికి గొడ్డలి పెట్టని అన్నారు. ట్రైబ్యునల్ ముందు రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతమైన వాదనలు వినిపించలేక పోయిందని ఆయన విమర్శించారు. కృష్ణా జలాలపై అఖిలపక్షం వేయాలని తాము డిమాండ్ చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన గుర్తు చేశారు.