: ట్రిపోలీ ఆయుధ కర్మాగారంలో పేలుడు : 10 మంది మృతి
లిబియా రాజధాని ట్రిపోలీలో ఉన్న ఆయుధ కర్మాగారంలో గురువారం పేలుడు జరగడంతో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద ఘటన వివరాలను మిలిటరీ గవర్నర్, బ్రిగేడియర్ మహ్మద్ అల్ దహబ్యా ఈరోజు వెల్లడించారు. అగంతుకులు ఆయుధ కర్మాగారాన్ని పేల్చేందుకు ప్రయత్నించడంతో ఈ ఘటన జరిగిందని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మహ్మద్ చెప్పారు.