: మహబూబ్ నగర్ జిల్లాలో టీడీపీ నేత పాదయాత్ర ప్రారంభం
మహబూబ్ నగర్ జిల్లా గద్వాల పట్టణంలో టీడీపీ నేత, మాజీ మంత్రి డి.కె.సమరసింహారెడ్డి పాదయాత్ర చేపట్టారు. మొదట పార్టీ జెండాను ఆవిష్కరించి, అనంతరం పాదయాత్రను ప్రారంభించారు. గద్వాల నియోజకవర్గ ప్రజల అభీష్టం మేరకు అవినీతి నిర్మూలన కోసం పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు. నేటినుంచి డిసెంబరు 16 వరకు యాత్ర సాగుతుందని సమరసింహారెడ్డి చెప్పారు.