: గల్ఫ్ తీరంలో భూకంపం.. ఏడుగురు మృతి
ఇరాన్ తీరంలోని అణు కేంద్రం వద్ద భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.7గా నమోదైంది. భూకంపం ధాటికి ఏడుగురు మృతి చెందగా, 190 మందికి గాయాలయ్యాయని ఎమర్జెన్సీ చీఫ్ హసన్ ఖాద్మీ తెలిపారు. క్షతగాత్రులకు ఆసుపత్రిలో చికిత్స జరుగుతోందని చెప్పారు. ఈ ఘటనలో 250 ఇళ్లు నాశనమవగా, విద్యుత్ సమస్య ఏర్పడిందన్నారు. అయితే, భూకంపం ధాటికి అణు కేంద్రంలో ఎలాంటి సమస్య ఏర్పడలేదని వెల్లడించారు.