: తగ్గుతుంది అనుకుంటే పెరిగిందట
పొగతాగే అలవాటును మాన్పించాలని చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టి ఈ అలవాటు మరింతగా పెరిగిందట. పొగతాగే అలవాటును మాన్పించాలని శాస్త్రవేత్తలు ఈ-సిగరెట్లను తయారుచేశారు. వీటితో ఈ అలవాటు తగ్గుముఖం పడుతుందని ఆశించారు. కానీ దీనికి విరుద్ధంగా యువతలో పొగతాగే అలవాటును ఈ-సిగరెట్లు మరింతగా పెంచుతున్నాయని కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది.
ఈ విషయాన్ని గురించి కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన సీనియర్ పరిశోధకులు స్టాంటన్ మాట్లాడుతూ పెద్దవారిలో కూడా ఈ-సిగరెట్ పొగతాగే అలవాటును మాన్పించలేకపోతోందని చెబుతున్నారు. వీటికి రోజురోజుకూ ప్రజల్లో బాగా ఆదరణ పెరుగుతోందని, అలాగే వీటి మార్కెటింగ్‌పై నియంత్రణ లేకపోవడం వల్ల వీటి వాడకం కూడా విపరీతంగా పెరుగుతోందని పరిశోధకులు చెబుతున్నారు. కొరియాలో ఈ-సిగరెట్లు తాగే 75 వేలమంది యువతపై జరిపిన ఈ అధ్యయనంలో ప్రతి ఐదుగురిలో నలుగురు ఈ-సిగరెట్లు తాగుతున్నట్టు తేలింది. అంటే ఈ-సిగరెట్టు పొగతాగే అలవాటును తగ్గిస్తుందని అనుకుంటే అదికాస్తా మరింతగా అలవాటును పెంచుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.