: మన జవాన్లకు చలి కష్టాలు తీరనున్నాయి
ఎముకలు కొరికే చలిలో సైతం తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశాన్ని కాపాడుతున్న మన వీరజవాన్లకు చలిని తట్టుకునే విధంగా సరికొత్త జాకెట్లను ప్రభుత్వం త్వరలోనే పంపిణీ చేయనుంది. సియాచిన్ హిమానీనదంపై దేశ రక్షణా బాధ్యతలను నిర్వర్తించే సైనికులు చలిలో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అక్కడుండే మైనస్ 50 డిగ్రీల సెంటీగ్రేడ్ శీతల వాతావరణాన్ని కూడా తట్టుకునే విధంగా స్విస్ జాకెట్లను ప్రభుత్వం సైనికులకు అందించనుంది. మూడు పొరలతో ఉండే ఈ జాకెట్ ఖరీదు రూ.35 వేలు. 40 వేల జాకెట్లను సియాచిన్, కార్గిల్, సిక్కిం తదితర ప్రాంతాల్లో విధులను నిర్వర్తించే మన జవాన్లకు ప్రభుత్వం త్వరలోనే అందజేయనుంది.