: అల్పపీడన ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు
దక్షిణ కోస్తాంధ్ర తీరాన్ని ఆనుకుని బంగాళాఖాతంలో అల్పపీడనద్రోణి ఏర్పడింది. ప్రస్తుతం ఇది స్థిరంగా కొనసాగుతోందని భారత వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీని ప్రభావంతో గురువారం నుంచి రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.
కాగా, శనివారం కోస్తాంధ్ర, రాయలసీమల్లో పలు చోట్ల వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ ప్రాంతంలో వాతావరణం మామూలుగానే ఉంటుంది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో శుక్రవారం కూడా పలు చోట్ల వర్షాలు కురిశాయి.