: పాలలో విషం కలిపి భర్తను లేపేయాలనుకుంది
పాలలో విషం కలిపి ఇచ్చి భర్తను హత్య చేసేందుకు ప్రయత్నించిందో భార్య. గుంటూరు జిల్లా పెద్దపలకలూరులో ఈ ఘటన జరిగింది. గత కొంత కాలంగా కాపురంలో చోటు చేసుకున్న కలహాలతో భర్తను వదిలించుకునేందుకు నిర్ణయించుకున్న భార్య ఈ అఘాయిత్యానికి పాల్పడింది. తరువాత అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయినప్పటికీ పరిస్థితి విషమంగానే ఉంది. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం అందాల్సి ఉంది.