: మంచి కోసం నా పోరాటం కొనసాగిస్తా: కేజ్రీవాల్


డిసెంబర్ 4న జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పరాజయం పాలైనా తాను ఢిల్లీ వదిలేదిలేదని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఢిల్లీలో ఓ న్యూస్ ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత ఎన్నికల్లో ఆప్ పరాజయం పాలైతే తాను ఢిల్లీ విడిచి వెళ్లిపోనని, మంచి కోసం తన పోరాటాన్ని కొనసాగిస్తానని అన్నారు. అవినీతి లేని భారత దేశాన్ని తయారు చేయాలన్నదే తన ఆకాంక్ష అని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.

ఆప్ కే ఎందుకు ఓటేయాలన్న ప్రశ్నకు సమాధనమిస్తూ దేశాన్ని దోచుకునే అనుభవం కానీ, దోచుకోవాలనుకునే ఆలోచన కానీ తమకు లేదని, అందుకే తమకు ఓటు వేయాలని ఆయన అన్నారు. దేశాన్ని ఎలా అభివృద్ధి చేయాలన్నదే తమ ఆలోచన అని తెలిపారు. అందుకే నూతన ఆలోచనా విధానంతో ప్రజల ముందుకు వస్తున్నామని ఆయన వివరించారు. పార్టీ ఎదుర్కొన్న శూల శోధన వివాదంలో ఎన్నికల సంఘం క్లీన్ చిట్ ఇచ్చిందని కేజ్రీవాల్ వెల్లడించారు.

  • Loading...

More Telugu News