: దొంగలందు మంచిదొంగలు వేరయా!
దొంగలందు మంచిదొంగలు వేరయా అన్నట్టు తాను కోట్టేసిన ఐఫోన్ సమాచారాన్ని బాధితుడికి పంపి దొంగల్లోనూ మంచోళ్లు ఉన్నారని నిరూపించాడో దొంగ. చైనాలోని సెంట్రల్ ప్రావిన్స్ హునన్ కు చెందిన జోబిన్ షేరింగ్ టాక్సీలో ప్రయాణిస్తూ తన యాపిల్ ఐఫోన్ పోగొట్టుకున్నాడు. తన ఫోన్ చోరీకి గురైందని గుర్తించి, ఆ ఫోన్ కే ఓ టెక్స్ట్ మెసేజ్ పంపించాడు. తన ఫోన్ లో ఉన్న నంబర్ల బ్యాకప్ లేదని, దయ చేసి ఐఫోన్ తిరిగి ఇచ్చేయాలని విజ్ఞప్తి చేస్తూ, తన అడ్రెస్ పేర్కొన్నాడు. కొద్ది రోజుల తరువాత తన అడ్రెస్ కు వచ్చిన ప్యాకేజీ చూసి జోబిన్ ఆశ్చర్యపోయాడు. ఫోన్ లో ఉన్న 1000 నంబర్ల రాతప్రతి ఆ పార్శిల్ లో వుంది. ఫోన్ లో బ్యాకప్ లేదన్నందుకు ఆ నంబర్లన్నీ తన స్వదస్తూరీతో రాశానని దొంగగారు చిన్న లేఖ కూడా రాశారు. ఐఫోన్ మాత్రం ఇవ్వలేదు!