: తీరం దాటిన తుపాను ... తప్పిన ముప్పు
లెహర్ తుపాను బలహీనపడి వాయుగుండంగా మారి మచిలీపట్నం వద్ద తీరం దాటింది. మచిలీపట్నం తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. 30 మీటర్ల వరకు సముద్రం ముందుకొచ్చింది. మంగినపూడి బీచ్ లో అలలు 2 మీటర్ల మేర ఎగసిపడుతున్నాయి. తుపాను తీరం దాటడంతో తీర ప్రాంత వాసులు ఊపిరి పీల్చుకున్నారు. పునరావాస కేంద్రాల నుంచి బాధితులు వారి ఇళ్లకు చేరుకుంటున్నారు.