: రాహుల్ రోటీ ఇస్తే.. మేము భోజనమే పెడతాం: వసుంధరా రాజే


కాంగ్రెస్ పార్టీపై రాజస్థాన్ బీజేపీ అధ్యక్షురాలు వసుంధరా రాజే విరుచుకుపడ్డారు. రాష్ట్రంలోని అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు భద్రత కరవైందని విమర్శించారు. కాంగ్రెస్ యువరాజు రాహుల్ ని ఉద్దేశిస్తూ... ఆయన మీకు రోటీ ఇస్తామంటున్నారని... మేము మీకు భోజనమే పెడతామని అన్నారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె భీమ్ లో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... మన మందరం కలసి కొత్త రాజస్థాన్ ను నిర్మిద్దామని పిలుపునిచ్చారు. బీజేపీ ప్రభుత్వంలో 24 గంటలూ విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News