: పాకిస్థాన్ ఆర్మీలో వివాదం.. లెఫ్టినెంట్ జనరల్ అస్లాం రాజీనామా
పాక్ ఆర్మీ చీఫ్ పదవికి జూనియర్ ను నియమించడం వివాదం రేపుతోంది.పాకిస్థాన్ సైన్యానికి చెందిన లెఫ్టినెంట్ జనరల్ హరూన్ అస్లాం తన పదవికి రాజీనామా చేశారు. జనరల్ కయానీ తరువాత సీనియర్ అయిన్ అస్లాం ఆర్మీ చీఫ్ పదవిలో తనను కాదని జూనియర్ ను నియమించడం పట్ల నిరసనగా రాజీనామా చేశారు. బుధవారం రాత్రి పదవీ విరమణ చేసిన కయానీకి గౌరవ సూచకంగా ప్రధాని ఇచ్చిన విందుకు కూడా అస్లాం హాజరు కాలేదు. జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్ పదవిలోనూ మరో జూనియర్ అధికారినే నియమించడం అస్లాం ఆగ్రహానికి కారణమైంది.