: సల్మాన్ శ్రీమతి కావాలని కోరుకోవడం క్యూట్: ఎల్లీ అబ్రహం
సల్మాన్ కు తగిన వధువు ఎల్లీ అబ్రహం అంటూ మీడియా కథనాలు వెలువరిస్తున్నాయి. ఇదే విషయాన్ని ఎల్లీ ముందు ప్రస్తావిస్తే.. పెద్ద నవ్వు నవ్వి.. 'ప్రజలు నన్ను సల్మాన్ శ్రీమతి కావాలని కోరుకోవడం చాలా బావుంది. కానీ, వివాహం అంటే నాకు పెద్ద విషయం. అంకితభావం, ఒకర్నొకరు గౌరవించుకోవడం, ఇంకా ఏమేమో. వివాహం గురించి అంత తేలిగ్గా ఆలోచించలేను. కానీ నిజమేమిటంటే సల్మాన్ తో స్నేహంగా ఉండడం ఇష్టం. భవిష్యత్తులో ఏమవుతుందో చెప్పలేను' అంటూ ఎల్లీ తన మనసును ఆవిష్కరించింది.