: రెండు రోజుల్లో శీతాకాల సమావేశాలపై స్పష్టత
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై మంత్రుల బృందం అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోనుందని కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి కొడికునిల్ సురేష్ తెలిపారు. హైదరాబాద్ లో ఓ ప్రైవేటు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, శీతాకాల సమావేశాలకు సంబంధించిన వివరాలు తనకేమీ అందలేదని, మరో రెండ్రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో న్యాయం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.