: సౌదీ రాజుకు ఇరాన్ తో ఒప్పందం గురించి వివరించిన ఒబామా
ఇరాన్ తో కుదిరిన అణు నియంత్రణ ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సౌదీ రాజు అబ్దుల్లాకు వివరించారు. ఇరాన్ అణు వ్యవహారాలపై అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, రష్యా, జర్మనీ చేపట్టే చర్యలపై ఎప్పటికప్పుడు సంప్రదించుకోవాలని ఇరువురూ అంగీకారానికి వచ్చారు. గతవారం కుదిరిన ఆరు నెలల తాత్కాలిక ఒప్పందం మేరకు ఇరాన్ తన అణ్వస్త్ర కార్యక్రమాలపై అంతర్జాతీయ పర్యవేక్షణకు అనుమతించాల్సి ఉంటుంది. అణుశుద్ధిని తగ్గించాల్సి ఉంటుంది. దీనికి ప్రతిగా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, రష్యా, జర్మనీ ఇరాన్ పై ఆంక్షలను సడలిస్తాయి.