: మచిలీపట్నానికి 80 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం


పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో లెహర్ తుపాను తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది మరింత బలహీనపడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇది గంటకు 20 కిలోమీటర్ల వేగంతో పయనిస్తోంది. మచిలీపట్నానికి తూర్పు ఆగ్నేయ దిశలో 80 కిలో మీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమై ఉంది. ఈ మధ్యాహ్నం మచిలీపట్నం వద్ద ఇది తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, తెలంగాణల్లో కొన్ని చోట్ల వర్షాలు, మరి కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్ర తీరం వెంబడి 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. అన్ని ఓడ రేవుల్లోనూ మూడో నెంబరు ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి.

  • Loading...

More Telugu News